కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ హనుమకొండ జిల్లా శాయంపేటలో గత సంవత్సరము మండల స్థాయిలో 10వ తరగతిలో మంచి మార్పులు సాధించిన 15మంది విద్యార్థులకు ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్( రిటైర్డ్ టీచర్ ) ప్రతిభా పురస్కారం లను ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శేఖర్ అధ్యక్షత మండల విద్యాధికారి బిక్షపతి చేతుల మీదుగా అందించడం జరిగినది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గత సంవత్సరం పదో తరగతిలో మంచి మార్పులు సాధించిన టాపర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పదవ తరగతి మంచి మార్కులు సాధించడం మొదటి స్టెప్ మాత్రమే అని, ఇదే విధంగా భవిష్యత్తులో మంచి మార్పులు సాధించాలని,విద్యార్థులు ఉత్తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని లక్ష సాధన కొరకు క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు. మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు అవార్డ్స్ అందించడం అభినందనీయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రతిభా పురస్కారములు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment