స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు చేనేత సహకార సంఘం ఎన్నికల నిర్వహించాలి

అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి బాసాని బాలకృష్ణ 
శాయంపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి బాసాని బాలకృష్ణ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్మికులకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాలుగా ఇన్చార్జిల పాలనలో చేనేత సహకార సంఘాలు నడవడం జరుగుతుందని గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టిన పాపాన పోలేదని వాపోయారు. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి చేనేత సంఘాల బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని ఆయన కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post