జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ చాంబర్‌లో రైతు ఉత్పత్తి సంఘాలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, సహకార సంఘాలకు డ్రోన్స్ పంపిణీపై వ్యవసాయ, ఉద్యాన, సహకార, డిఆర్డీఓ, నాబార్డ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్. మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు డ్రోన్ల వినియోగంపై చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో పంపిణీ చేసేందుకు 12 డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని మండలాల వారీగా ఒక్కో మండలానికి ఒక డ్రోన్ చొప్పున పంపిణీ చేయాలని తెలిపారు. ఇందుకోసం విజయవంతంగా నడుస్తున్న రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాల నుండి సభ్యులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ మూడు కేటగిరీల సంఘాలను ప్రామాణికంగా తీసుకుని మండలానికి ఒకటి చొప్పున అన్ని మండలాలు కవరు అయ్యేలా డ్రోన్లు పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడీఏ బాబు, ఉద్యాన వనశాఖాధికారి సునీల్ కుమార్, డిఆర్డీఓ బాలకృష్ణ, డీసీఓ వాల్య నాయక్, నాబార్డు ఈజిఎం చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment