జూన్ మాసంలో ఇవ్వమని ఆదేశించగా, తదనుగుణంగా పంపిణీ చేయడం జరిగినదని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లికు సంబంధించి మొత్తం 1,25,588 కార్డుదారులకు గాను 1,08,492 (86.38) కార్డు దారులకు 6356.524 మెట్రిక్ టన్నుల (89.6 %) బియ్యమును పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డులకు సంబందిoచి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయబడుతుందని మరియు కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిరంతర కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మొత్తము 9,362 దరఖాస్తులను కొత్త కార్డు కొరకు మీసేవ ద్వారా స్వీకరించడం జరిగిందని అన్నారు. అందులో 4,520 కార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన 4,396 లబ్ధిదారులకు కార్డులను మంజూరు చేయడమైనదని మరియు 16,803 దరఖాస్తులను కుటుంబ సభ్యుల చేర్పుల కొరకు స్వీకరించడం జరిగిందని, అందులో 14,377 దరఖాస్తులను మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియలో మధ్యవర్తి లేదా దళారులను ఆశ్రయించకూడదని, ఒకవేళ చట్టవ్యతిరేఖ పనులు చేసినట్టు గుర్తించిన యెడల, అట్టివారి మీద చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకొనబడునని ఆయన తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉన్నయెడల సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో కానీ జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం,కలెక్టరేట్ లో దరఖాస్తు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూన్, జూలై మరియు ఆగస్టు మాసములకు సంబంధించిన ప్రజా పంపిణీ (బియ్యం పంపిణీ)
byBLN TELUGU NEWS
-
0
Post a Comment