జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో ఆర్థిక సంక్షేమ పథకాలపై సమగ్ర శిబిరం నిర్వహించబడినట్లు ఎల్డిఎం తిరుపతి తెలిపారు.
మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – కాటారం శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఎల్డిఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రధానమంత్రి జనధన్ యోజన (PMJDY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY), అలాగే KYC పునరిద్దరణ నూతన నమోదులు మరియు పునర్నవీకరణలను చేపట్టినట్లు తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఈ ప్రధాన ఆర్థిక సామాజిక భద్రతా పథకాల పరిధిని 100% పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాటారం ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్,
అంకుషాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment