రాబోయే ఐదేళ్లలో భారత్ - ఘనా దేశాలు వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ

భారతదేశం, ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని ఇరుదేశాలు కలిసి జోడీగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయని మోదీ చెప్పారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధులు, ప్రజల నుంచి సాదర స్వాగతం లభిస్తోంది. ప్రధాని మోదీ, ఘనా అధ్యక్షుడు జాన్‌ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు.ఇండియా.. ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఉగ్ర ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని* నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు. రక్షణ, భద్రతా రంగంలో ఇరుదేశాలు కలిసి ముందుకు సాగుతాయని మోదీ చెప్పారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సామాగ్రి సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్‌-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ తెలిపారు. అటు, సంస్కృతి, సాంప్రదాయ వైద్యం తోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.
అనంతరం ఘనా పార్లమెంటును సందర్శించి, సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. .సభలో ప్రసంగించడం తనకు చాలా గౌరవంగా ఉందన్న మోదీ..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రతినిధిగా, 1.4 బిలియన్ల భారతీయుల సద్భావన, శుభాకాంక్షలను నాతో తీసుకువచ్చాననిమోదీ అన్నారు. 'నిన్న సాయంత్రం నా ప్రియ స్నేహితుడు, అధ్యక్షుడు జాన్ మహామా నుంచి మీ జాతీయ అవార్డును స్వీకరించడం హృదయపూర్వక అనుభవమని మోదీ సభకు చెప్పారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిఅని చెప్పిన మోదీ. మనకు, ప్రజాస్వామ్యం కేవలం ఒక వ్యవస్థ కాదు.. ఇది మన ప్రాథమిక విలువలలో ఒక భాగం అన్నారు.
 భారతదేశంలో 2,500 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాలను పరిపాలించే 20 వేర్వేరు పార్టీలు, 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయని* మోదీ చెప్పారు. భారతదేశానికి వచ్చిన ప్రజలను ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా స్వాగతించడానికి ఇదే కారణమని ప్రధాని అన్నారు. ఘనా రిపబ్లిక్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ, 'ఇవాళ మన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, ఘనా బిడ్డ డాక్టర్ క్వామే న్క్రుమాకు నివాళులర్పించే గౌరవం నాకు లభించింది.' అని మోదీ అన్నారు. ఘానా పర్యటలో ప్రధాని మోదీ ఘనా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశిష్ట రాజనీతి, ప్రభావవంతమైన ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రామణి మహామా చేతుల మీదుగా ఘనా జాతీయ గౌరవం 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా' పురస్కారాన్ని అందుకున్నారు.1.4 బిలియన్ల భారతీయుల తరపున ఈ అవార్డును స్వీకరిస్తున్నానని చెప్పిన మోదీ.. ఈ గౌరవాన్ని భారతదేశ యువత ఆకాంక్షలు, సాంస్కృతిక సంప్రదాయాలు, వైవిధ్యం, ఇంకా ఘనా - భారత్ మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేశారు. ఈ గౌరవాన్ని అందించినందుకు ఘనా ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post