పేదలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుంది.తాజాగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. ఈనెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారనిపౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 11.30 లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంది.రేషన్‌కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఈనెల 14 జరగనున్న సభలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు రేషన్‌కార్డు పత్రాలను అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్...!!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment