తొలి టెస్ట్‌లో సెంచరీ చేసిన గిల్ ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న టెస్ట్‌లోనూ తన క్లాస్ చూపిస్తున్నాడు ఎంతో ఓర్పు, సంయమనంతో చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి రోజే సెంచరీ సాధించాడు. ఈ రోజు 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు. అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 288 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్‌తో 168 పరుగులతో ఆడుతున్నాడు.టెస్ట్‌ల్లో 150 ప్లస్ స్కోరు సాధించడం గిల్‌కు ఇదే తొలిసారి. ఈ క్రమంలో గిల్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. *ఇంగ్లండ్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గిల్ కంటే ముందు 1990లో అజారుద్దీన్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 179 పరుగులు చేశాడు. గిల్ మరో 12 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా ఘనత సాధిస్తాడు.
ప్రస్తుతం టీమిండియా 110 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 419 పరుగులతో ఆడుతోంది. *గిల్ సెంచరీకి తోడు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కీలక పరుగులు చేశారు.* ప్రస్తుతం గిల్‌కు తోడుగా వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నాడు. ఈ రోజు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి ఇంగ్లండ్ మీద ఒత్తిడి పెంచడానికి టీమిండియా ప్రయత్నాలు చేస్తోంది.
Post a Comment