చిన్న వయసులోనే రచయితగా వరల్డ్ బుక్ రికార్డు సాధించిన వేదార్థ్ వడ్లూరిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అభినందించారు. కరీంనగర్, హుజురాబాద్ కు చెందిన వేదార్థ్ వడ్లూరి 143 పేజీల స్కోరాబ్: లస్ట్రస్ లవ్ పుస్తకాన్ని రచించి వరల్డ్ బుక్ రికార్డు సాధించారు. హన్మకొండ ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరల్డ్ బుక్ రికార్డు సాధించిన వేదార్థ్ వడ్లూరిని ఎంపీ డా.కడియం కావ్య శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే, వేదార్త్ అసాధారణమైన కవితా ప్రతిభను ప్రదర్శించి, ప్రేమ యొక్క సారాన్ని సంగ్రహించి రాయడం గొప్ప విషయం అన్నారు. అతని రచన భావోద్వేగాలు, మానవ సంబంధాల అందాన్ని అన్వేషిస్తుందన్నారు. వేదార్త్ భాషపై పాండిత్యం మరియు పదాలు పాఠకులను మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. ఇది ఔత్సాహిక కవులు మరియు రచయితలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. జీవితంలో ఇంత చిన్న దశలో కవిత్వం పట్ల వేదార్త్ కు ఉన్న అంకితభావం అతనికి ఇంతటి గుర్తింపును సంపాదించిపెట్టిందని తెలిపారు. భవిష్యత్తులో గొప్ప రచయితగా మరింత పేరు ప్రఖ్యాతలు సాధించాలని వేదార్త్ ను ఎంపీ డా.కడియం కావ్య ప్రోత్సహించారు.
వరల్డ్ బుక్ రికార్డు సాధించిన వేదార్థ్ వడ్లూరిని అభినందించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
byBLN TELUGU NEWS
-
0
Post a Comment