పరకాల మున్సిపల్ ఒకటో వార్డులో నెలకొన్న పలు సమస్యలపై, వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురిసి నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున దోమల నివారణ మందు పిచికారి చేపించాలని, ఆయిల్ బాల్స్ తయారు చేసి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో వేయడం లాంటి ముందస్తు చర్యలు చేపట్టాలని. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ పేరు మీద ఇన్వార్డ్ సెక్షన్ లో వినతి పత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్
స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త క్రమము తప్పకుండా సేకరించాలని
వీధులలోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా క్రమం తప్పకుండా సేకరించాలని
మురికి కాలువలు ఎప్పటికప్పుడు తీపించాలని, తీపించిన చెత్త కుప్పలను వెంటనే తీపించాలని, మురికి కాలువల వెంట ఉన్న, రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని
అంటువ్యాధులు రాకుండా, దోమల ద్వారా సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, చికెన్ గున్యా, డయేరియా తదితర వ్యాధుల బారిన పడకుండా దోమల మందు పిచికారి చేపించాలని
నల్లాల ద్వారా అందిస్తున్న నీళ్లలో బ్లీచింగ్ వేయించాలని
మురికి కాలువల వెంట, దుర్వాసన వస్తున్న ప్రదేశాలలో బ్లీచింగ్ చల్లించాలని
వార్డులో వీధిలైట్లు వెలుగనిచోట వెంటనే వీధిలైట్లు వెలిగించాలని, వీధిలైట్లు వెలిగించే టైమర్లు వెంటనే రిపేర్ చేపించాలని
ప్రజల సౌకర్యార్థం సానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని, ప్రజలు ఆరోగ్యంగా జీవించేలా పరిశుభ్రత పాటించాలని మాజీ కౌన్సిలర్ కోరినారు.
Post a Comment