ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ

 పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూలు పర్యటన చేయడం జరిగింది ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
మాట్లాడుతూ మల్లారెడ్డి స్కూల్ లో విద్యార్థులు 50 మందికి పైగా ఉన్నారు విద్యార్థులకు రూమ్స్ లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులకు వెంటనే నూతన బిల్డింగ్ నిర్మించాలి అదేవిధంగా రాజీ పేట ప్రైమర్ స్కూల్లో ఒకే రూమ్ ఉండడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు వెంటనే క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూమ్స్ సరిపడం లేదు వెంటనే నూతన బిల్డింగ్ నిర్మించాలి పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కనీసం వాటర్ సౌకర్యం లేదు వెంటనే సమస్యలు పరిష్కరించాలి పరకాల ఎంఈఓ  వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలి
 లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో ఉద్యమాలు చేపడతాం ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ పట్టణ కార్యదర్శి కోగీల సాయి తేజ పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్ పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post