పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిరిగా నాటాలని పరకాల శాసనసభ్యులు .రేవూరి ప్రకాశ్ రెడ్డి

దామర మండలం ఓగులాపూర్ గ్రామంలోని సైలని బాబా దర్గాలో దర్గా పీఠాధిపతి హజ్రత్ పీర్ హాజి ముహమ్మద్ అబ్దుల్ హమీద్ షా మియ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి. ప్రకాశ్ రెడ్డి  వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. అంతకుముందు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి,వాటిని సంరక్షించే బాధ్యత తీసుకొని, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు విరివిరిగా చెట్లను పెంచాలన్నారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడానికి ప్రధాన కారణం పచ్చదనం అని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలన్నారు.మనందరం కలిసి ఈ బాధ్యతను నిర్వహిద్దాం , పచ్చని భవిష్యత్తును నిర్మిద్దాం అని అన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post