చేసిన వెదవ పనికి సిగ్గుపడండి..!

షాద్ నగర్ లో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందన
చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు 
షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి
హ్యాట్సాఫ్ అంటూ ఎమ్మెల్యే శంకర్ కు "సెల్యూట్ చేసిన మంత్రి
ఎమ్మెల్యే శంకర్ ను ప్రశంసలతో ముంచెత్తిన మంత్రి జూపల్లి కృష్ణారావు
చేసిన వెధవ పనికి సిగ్గుపడకుండా దాడులు చేస్తామని ప్రకటనలు చేయడం సహించబోమని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కన్హ శాంతి వనం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్యాంపు కార్యాలయానికి మంత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్, షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నేతలు కృష్ణారెడ్డి, రఘు నాయక్, చెంది తిరుపతిరెడ్డి, అగ్గనూర్ బస్వం, మొహమ్మద్ ఇబ్రహీం, అందే మోహన్, ముబారక్, లింగారెడ్డి గూడా అశోక్, గంగముని సత్తయ్య తదితరులు మంత్రిని కండువాలతో సన్మానించారు. 
ఎమ్మెల్యే శంకర్ కు సెల్యూట్ చేసిన మంత్రి
మంత్రి జూపల్లి కృష్ణారావు షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వతహాగా కట్టిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కళాశాల నిర్మాణాలను స్వయంగా పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కళాశాల నిర్మాణ వ్యయం తదితర అంశాలను తెలుసుకొని ఆశ్చర్యపోయారు. దాదాపు 80 శాతం నిధులు ఎమ్మెల్యే సొంతంగా భరిస్తూ మరికొన్ని విరాళాలు పట్టణ ప్రముఖుల ద్వారా స్వీకరించి చేపట్టిన ఈ మహా కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముగ్ధులయ్యారు. ఇంత గొప్ప ఆశయంతో విద్య కోసం ఎమ్మెల్యే శంకర్ పడుతున్న తపన తనను ఆకట్టుకుందని వెంటనే సెల్యూట్ చేశారు. వీర్లపల్లి శంకర్ లాంటి వ్యక్తులు తమ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినందుకు గర్వపడుతున్నామని అన్నారు. ఇలాంటి స్వప్రయోజనాలు స్వార్థ చింతన లేకుండా భవిష్యత్ తరాల బాబు కోసం మంచి విద్యను అందించేందుకు మౌలిక సదుపాయాల రూపకల్పనలో భాగంగా సొంత నిధులు వెచ్చించి గొప్పగా ఆలోచించి ఈ కార్యక్రమానికి పూనుకోవడం తనను అమితంగా ఆకట్టుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. అదేవిధంగా కళాశాలలో విద్యాభివృద్ధి కోసం గత విద్యా సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా స్వయంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే విషయాన్ని మీడియా అదే విధంగా లెక్చరర్లు స్థానిక నాయకులు కూడా చెప్పడంతో మంత్రి మురిసిపోయారు. అదేవిధంగా చెత్త కాగితాలు ఏరుకునే మురికివాడలోని పిల్లలను చేరదీసి ఆర్థికంగా వారికి కొంత ఖర్చు చేసి అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్లి వారిని చేర్పించడం ఇలాంటి విషయాలను న్యూస్ చానల్స్ తెలుసుకొని మంత్రి పొంగిపోయారు. ఇంత గొప్ప ఆలోచనతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే శంకర్ లాంటివాళ్లు ఈ సమాజానికి ఎంతో అవసరమని జూపల్లి కృష్ణారావు వివరించారు..

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post