జులై 2 నుంచి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుక పొదాం.

నియోజకవర్గంలోని ఆమడ గూరు మండలం కసముద్రం నుంచి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం 
ముఖ్యమంత్రి చంద్రబాబు సూపరి పాలనలో కూటమి ప్రభుత్వం తొలి అడుగు
అతి త్వరలో అన్నదాత సుఖీభవ ద్వారా రైతు ఖాతాలోకి డబ్బులు 
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి 
ఓడి చెరువు:01
కూటమి ప్రభుత్వం లో రాష్ట్రంలో చేసిన మంచినీ ప్రజల్లోకి తీసుకెళ్దామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు . మండలంలోని ఐటిఐ కలశాలలో మంగళవారం పుట్టపర్తి నియోజవర్గ టీడీపీ కన్వీనర్లు ,క్లస్టర్ ,యూనిట్ ఇన్ ఛార్జ్ లు ,గ్రామ కమిటీ ,బూత్ కమిటీ ,సాధికారత కమిటీ సభ్యులు ,అనుబంధ సంఘాల కమిటీ సభ్యులతో ఏడాదీ పాలనపై కూటమి ప్రభుత్వం జులై 2 నుంచి ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమం పై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని సగౌరవంగా చెప్పుకొనే మంచి రోజులు వచ్చాయని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆమడగూరు మండలం కసముద్రం నుంచి బుధవారం ఇంటింటికి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లో ఒక సుపరిపాలనకు తొలి అడుగు అన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మూడు రెట్లు పెంచి ఒకే రోజులో 64 లక్షల కుటుంబాలకు పంపిణీ చేస్తోందని తెలిపారు. అది త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి 20000 ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తొలి దశలో 7000 రూపాయలు రైతు ఖాతాల్లోకి జమ చేస్తుందని తెలిపారు. దీపం పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తుందన్నారు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5 రూపాయలకే పేదలకు మూడు పూటలా కడుపు నింపేలా నాణ్యమైన భోజనాన్ని అందిస్తోందని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేపడుతోందని తెలిపారు అంతేకాకుండా మరోవైపు రాష్ట్రంలో అమరావతి రాజధాని, పోలవరం తో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోందని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం లో 193 చెరువులతోపాటు రెండు రిజర్వాయర్లు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఇవి కాక పుట్టపర్తిలో నూతన స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు అందుకు స్థలం అవసరమని వాటి సేకరణ కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనాతికాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం నుంచి ముఖ్యమైన వాటికి జీవోలు తీసుకొచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలను చేపడుతోందని అందుకు ఉదాహరణగా ఈమధ్య సత్యసాయి బాబా 100వ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ , ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర్ల ఆరాధ్య దైవం వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం సత్వరమే పరిష్కారం చూపుతోందనీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పుట్టపర్తి నియోజకవర్గం ఆదర్శంగా నిలుపుతామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగినట్లుగా కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జులై 2 నుంచి అమడుగూరు మండలం కసముద్రం నుంచి ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు ఒడి చెరువు మండలంలోని కొండక మార్ల పంచాయతీలోని గంగిరెడ్డిపల్లి బీసీ కాలనీలో ఓడి చెరువు ఎస్సీ కాలనీలో గాజుగుంటపల్లి మిట్టపల్లి పంచాయతీల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేపట్టారు. మల్లాపల్లి లో వాల్మీకి మహర్షి గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ జయచంద్ర మాజీ జడ్పిటిసి పిట్టా ఓబుల్ రెడ్డి తుమ్మల మహబూబ్ బాషా అంజనప్ప ,పీట్ల సుధాకర్ నిజాం ,రాజారెడ్డి, శివారెడ్డి , జాకీర్ , ఆంజనేయులు ,జయచంద్ర రెడ్డి , గంగాధర్ ,సురేష్ , కొండేటి ఈశ్వరయ్య ,బాలకృష్ణారెడ్డి , మండల కన్వీనర్లు గోపాల్ రెడ్డి , మైల్ శివ శంకర్ , సలాం ఖాన్ , రాజారెడ్డి ,ట్రేనర్లు మంజు , వెంకట రమణ , తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post