పన్నుల్లో పెద్ద చేయి.. వాటాల్లో మొండిచేయి..

కేంద్ర బిజెపి సర్కారు తీరు వల్లే తెలంగాణకు ఇబ్బందులు.. 
అయినా అధికమించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.. 
కేంద్ర ప్రభుత్వ వివక్షను ఎదుర్కొని తీరాల్సిందే
షాద్ నగర్ గిరిజన కాంగ్రెస్ నాయకుడు పీ రఘునాయక్ 
జూన్ 4వ తేదీన గ్రామస్థాయి నేతలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభ
కేంద్రానికి అంది వచ్చే పన్నుల్లో పెద్దచేయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది అయినప్పటికీ, బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తూ కేంద్రం వివక్షతో వ్యవహరిస్తుందని గిరిజన, ఆదివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘు ధ్వజమెత్తారు. జూన్ 4వ తేదీన గ్రామస్థాయి నేతలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ గ్రామస్థాయి కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలని పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఏర్పాటుచేసిన సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలను ఈ కార్యక్రమాన్ని తరలిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక తల్లితరహాలు సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు తమ అక్కసు వెళ్ళగక్కుతూ ప్రతి విషయంలోనూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున పన్నులు అందుతున్నప్పటికీ అందుకు తగినట్లుగా నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారని, మెట్రో, ఆర్ఆర్ ఆర్, మూసీ నది ప్రక్షాళన తదితర అంశాలకు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, వీరేశం, రాజు, నరసింహులు, కొత్తూరు మున్సిపల్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post