జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..
ప్రముఖ వైద్యులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం
హాజరైన షాద్ నగర్ ఏసీపి లక్ష్మీనారాయణ
దేవుడు జన్మని ఇస్తాడు.. కానీ ఆ జన్మలో ఎదురయ్యే ఏ ప్రమాదం నుంచి అయినా మనిషిని కాపాడి అతనికి పునర్జన్మను ఇచ్చేది ఒక వైద్యులు మాత్రమేనని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలో జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రాణం పోయే గల శక్తి ఒక్క వైద్యుడికే ఉందని ఆయన అన్నారు. ప్రాణాలు కాపాడే క్రమంలో ఒకవేళ విఫలమైతే వైద్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సామాన్యులు మానుకోవాలని, ప్రతి వైద్యుడు ప్రాణం పోయడానికే ప్రయత్నిస్తాడని ఆయన పేర్కొన్నారు. షాద్ నగర్ ఏసీపి ఎస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైద్యుల పట్ల తన అపారమైన గౌరవం ఉందని, వారిని నిరంతరం గౌరవిస్తానని అన్నారు. పట్టణ సీఐ విజయ్ కుమార్, వైద్యులు నాగవర్ధన్ రెడ్డి, కార్తీక్, ప్రతాప్ కుమార్, దిలీప్ చంద్ర, దయానంద్, విజయలక్ష్మి, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్, రమేష్, బండారి మల్లప్ప, శ్రీనివాస్ రాథోడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పవర్ అలీ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు విశ్వం, చెంది తిరుపతిరెడ్డి, అగునూరు బస్వం, కృష్ణారెడ్డి, ఇబ్రహీం, రఘునాయక్, మెహమూద్, కృష్ణ, బాలరాజ్ గౌడ్, సుదర్శన్ గౌడ్, సీతారాం, శ్రీశైలం గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రఘు గౌడ్, శ్రీను నాయక్, ముబారక్ అలీ ఖాన్, లింగారెడ్డిగూడెం అశోక్, సాయి కృష్ణ, ఖదీర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు..
Post a Comment