తెలంగాణలో కాంగ్రెస్ పార్టీల గెలుపు ముమ్మాటికీ కార్యకర్తల ఫలితమేనని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

 ఇవాళ ఆయన *ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సమాజిక న్యాయ సమర భేరి సభలో* పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పని చేశారని కొనియాడారు. *రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క కలిసి రాష్ట్రంలో పార్టీ గెలుపునకు కృషి చేశారని కితాబిచ్చారు. కేసీఆర్, బీజేపీ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కామెంట్ చేశారు. కానీ, విజ్ఞలైన ప్రజలు ఆ రెండు పార్టీలను ఓడించి ఇంట్లో కూర్చొబెట్టాయని ఎద్దేవా చేశారు.
11 ఏళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు ఏం తెచ్చారు..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గతంలో చెప్పానని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తమ పార్టీ పాలనలోనే రాష్ట్రానికి 50కి పైగా కేంద్ర ప్రభుత్వం సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక గత 11 ఏళ్లలో ఏం తెచ్చారని ప్రశ్నించారు. మోడీ ప్రజలకు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోందని* తెలిపారు. నిరుపేదలకు రేవంత్ సర్కార్ నాణ్యమైన సన్నబియ్యం అందిస్తుందనిఅన్నారు. రైతు భరోసా కింద రూ.8,200 కోట్లను అన్నదాతల ఖాతాల్లోకి జమ చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో తాము ఏం చెప్పామో.. అవన్నీ ప్రత్యక్షంగా చేసి చూపించామని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
దేశంలో తొలిసారి కులగణన..
దేశంలో తొలిసారిగా కులగణన తెలంగాణలో జరిగిందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తెలంగాణ కులగణన దేశానికే ఓ రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంలోనూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందినదని.. తెలంగాణలో గత ప్రభుత్వం అత్యంత అవినీతికి పాల్పడిందని* ఆరోపించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ నిలువునా మోసం చేశారని ఫైర్ అయ్యారు. నరేంద్ర మోడీ, అమిత్ షా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటుంన్నారని.. కానీ, అసలు వాళ్లు ఈ దేశానికి, తెలంగాణ చేసిందేమటని ప్రశ్నించారు. ఇప్పటికి మోడీ 42 దేశాలు తిరిగారని.. కానీ ఇంత వరకూ మణిపూర్ వెళ్లడానికి మాత్రం ఆయనకు మసను రావట్లేదని అన్నారు.రాహుల్ గాంధీ, తాను కలిసి స్వయంగా మణిపూర్ వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నామని* గుర్తు చేశారు.మోడీ విదేశాంగ విధానం సరిగ్గా లేదు.. 
ఆపరేషన్ సిందూర్‌కు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతును ఇచ్చిందని.. అఖిలపక్ష సమావేశానికి మాత్రం మోడీ రాలేదని అన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారం బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. అదీ మోడీ దేశభక్తి.. అదీ మోడీ ఆలోచనా విధానమని మండిపడ్డారు. మణిపూర్ ఈ దేశంలో భాగంగ కాదా.. అక్కడి ప్రజలు భారతీయులు కాదా* అని ప్రశ్నించారు. మోడీ జీ.. ముందు దేశ ప్రజల బాధలు వినండి.. తర్వాత విదేశాల సంగతి చూడవచ్చుఅంటూ హితవు పలికారు. పాకిస్తాన్‌ను ఏదేదో చేస్తామంటూ గొప్పలు చెప్పారని.. యుద్ధాన్ని మధ్యలోనే ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. దేశం కోసం ఇందిర, రాజీవ్‌లు ప్రాణాలు అర్పించారని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా ప్రణాలు అర్పించారా* అని అన్నారు. గతంలో అమెరికా బెదిరించి ఇందిరా గాంధీ బెదరలేదని.. వారి హెచ్చరికలను బేఖాతరు బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించారని గుర్తు చేశారు. మోడీ విదేశాంగ విధానం సరిగ్గా లేదని, తప్పుడు విధానంతో అందరినీ శత్రువులుగా మార్చుకుంటున్నారని* అన్నారు. జై బాపు, జై భీమ్.. జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలని* పిలునిచ్చారు. సెక్యూలరిజంను రాజ్యాంగం నుంచి ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షాలు ఎవరూ తీసివేయలేరని... మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post