హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. తాము అధికారంలోకి వచ్చినపుడు తమ ప్రభుత్వం మూన్నాళ్ళ ముచ్చటేనని ఎగతాళి చేశారని, నేడు సక్సెస్ ఫుల్ గా ప్రజా పాలనను, సంక్షేమ పాలనను అందిస్తున్నామని అన్నారు. తాము ఎక్కడ విఫలం అవుతామా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలకు చెంప పెట్టులాగా కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు 70 లక్షల మంది రైతులకు అందించామని వెల్లడించారు.గత ప్రభుత్వ నాయకులు రైతులు వరి వేస్తే ఉరి వేసుకోవాలని బెదిరించారని, తాము మాత్రం వరి పండించిన రైతులకు బోనస్ లు ఇచ్చి, రైతే రాజు అనే మాటను నిజం చేస్తున్నామని అన్నారు. ఆనాడు ఇందిరమ్మ పేదలను దృష్టిలో ఉంచుకొని ఇళ్ళు, భూములు ఇచ్చిందని.. ప్రతి పేదవాని ఇంట్లో ఏదో రకంగా ఇందిరమ్మ పేరు వినిపిస్తూనే ఉందని తెలిపారు. అందుకే తాము ఎలాంటి పథకాలు మొదలు పెట్టినా ఇందిరమ్మ పేరు పెడతామని, పేదవాళ్ళ కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెడితే ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇందిరమ్మ లాగానే, ఆడపడుచులను తాము గౌరవిస్తామని.. అన్ని పథకాలలో మహిళలకే పెద్ద పీట వేస్తామని అన్నారు. మహాలక్షీ పథకం, సోలార్ ప్లాంట్ల నిర్వహణ, ఇందిరా స్వయం సహాయక సంఘాలు ఇలా అన్నిట్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని.. రాష్ట్రంలో కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామనిఅన్నారు. తెలంగాణలో కులవృత్తుల పరంగా తెలంగాణ బిడ్డలు గొర్రెలు కాయమని, చేపలు పట్టుకోమని, చెప్పులు కుట్టుకోమని చెప్పి.. కేసీఆర్, కేటీఆర్ మాత్రం రాజ్య పాలన చేసే కుర్చీలో కూర్చుంటామని కుతంత్రాలు చేశారని మండిపడ్డారు. కానీ తాము అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లు పూర్తి చేస్తూ *ఏడాదిన్నరలోనే 60 వేల నియమకాలు ఇచ్చామని అన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, ఈ పెట్టుబడుల ద్వారా యువతకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామనితెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాకపోవడం ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని..కాని తెలంగాణలో నెలకొల్పబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా భారత దేశానికి భవిష్యత్తులో తెలంగాణ యువత బంగారు పథకాలు తెచ్చి చూపిస్తారని మోడీకి సవాల్* విసిరారు. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు తమను గెలిపించారని, ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను, స్థానిక నాయకులను గెలిపించే బాధ్యత తనదేఅన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాలు పెరగబోతున్నాయని.. 119గా ఉన్న సీట్లు 150కిపైగా అవుతాయని మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాదిఅన్నారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ రాబోతోందని, తెలంగాణ అమ్మలు, అక్కలు అసెంబ్లీలో, పార్లమెంటులో భారీగా గెలుస్తారని తాము దగ్గర ఉండి గెలిపిస్తామని* అన్నారు.
తెలంగాణలో తమకు తిరుగులేదని విర్రవీగుతున్న దొరల గడీని బద్దలు కొట్టి మూడు రంగుల జెండా పట్టి 4 కోట్ల మందిని ఉత్తేజపరిచి దొరలను తరిమికొట్టామని సీఎం రేవంత్ రెడ్డి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment