జిల్లాలో భద్రతా బలగాల ఎదుట లొంగిపోయినట్టు బస్తర్ రేంజ్ పోలీసు ఉన్నతాధికారి సుందర్ రాజ్ తెలిపారు.
వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన నక్సలైట్లపై మొత్తం రూ.1 కోటి 18 లక్షల రివార్డు ఉంది. అందులో 11 మంది సీనియర్ మావోయిస్టులు సైతం ఉన్నారు. వీరందరూ సీపీఐ మావోయిస్టు అనుబంధ సంఘాలైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జెడ్‌సీ), పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వంటి క్రియాశీల సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
అంతేగాక ఆ బృందంలో 2012లో సుక్మా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్‌ను అపహరణలో పాల్గొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డివిజనల్ కమిటీ సభ్యుడు పోడియం భీమా అలియాస్ లోకేష్ కూడా ఉన్నారు. కాగా, అంతకుముందు రోజు నారాయణపూర్ జిల్లాలో 22 మంది నక్సలైట్లు సరెండర్ అయిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తాకినట్టు అయింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 427 మంది నక్సలైట్లు హతం కాగా, గత ఏడాదిన్నరగా 1,428 మంది నక్సలైట్లు లొంగిపోయారు.
Post a Comment