90 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ జగదీష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంట్రాక్టర్ దగ్గర నుంచి రూ. 90 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ జగదీష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓదెల మండలం బాయమ్మ పల్లెకు చెందిన *కాంట్రాక్టర్ కావటి రాజు మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్లు పనులు చేయగా బిల్లుల కోసం ఏఈ జగదీష్ కాంట్రాక్టర్ ను లక్ష రూపాయలు డిమాండ్ చేయగా..రూ. 90 వేలకు ఒప్పందం కుదిరింది . దీంతో బాధితుడు కాంట్రాక్టర్ కావేటి రాజు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న ప్రధాన రహదారిపై కారులో కాంట్రాక్టర్ కావటి రాజు రూ. 90 వేలు ఏఈ జగదీష్ కు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post