- ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వొద్దు.. ఎవ్వరైనా ఇళ్లిప్పిస్తానని డబ్బులు అడిగితే నాకు చెప్పండి..
- గణపురం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
గణపేశ్వరాలయంలో రూ.234 లక్షలు.., గణపసముద్రంలో రూ.1128 లక్షలతో కాటేజీలు, బోటింగ్, రెస్టారెంట్ తో సహా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..
గణపురం మండలం, 5 జూన్ 2025:
అర్హులైన పేద, నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని, మొదటి విడతలో ఇళ్లు రానివారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం నియోజకవర్గంలోని గణపురం మండలం గొల్లపల్లి, బసవరాజుపల్లి, జంగుపల్లి, వెంకటేశ్వర్లపల్లి, ధర్మరావుపేట, నగరంపల్లి, కొండాపూర్, సీతారాంపూర్, అప్పయ్యపల్లి, కర్కపల్లి, మైలారం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూస్తుంటే తాను(ఎమ్మెల్యే) భావోద్వేగానికి లోనయ్యానని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన అద్భుతంగా ఉంటుందని అన్నారు. గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం రూ.22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం అజెండాగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నా మని అన్నారు. రైతులకు దాదాపు రూ.21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ.500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి రూ. 12 వేల రూపాయలకు పెంచామని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు అందించే ఇండ్లు మొదటి విడత మాత్రమేనని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులు పలువురు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల కాలంగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు ఇళ్లు మంజూరు కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారుఅనంతరం గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో సాస్కి నిధులు రూ.234 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, గణపసముద్రం లో రూ.1128 లక్షలతో కాటేజీలు, బోటింగ్, రెస్టారెంట్ తో సహా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
Post a Comment