ACPని మర్యాదపూర్వకంగా కలిసిన మండల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ.

పరకాల మండల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ పరకాల అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరకాల ACP OFFICE నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ACP నూతన కమిటీ అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు గారిని మరియు ప్రధాన కార్యదర్శి నవత బ్రదర్స్ శివాజీని కోశాధికారి మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ACPమాట్లాడుతూ... విత్తనాలు ఎరువులు పురుగు మందులు వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు ఎరువులను రైతులకు అందించే విధంగా నాణ్యత ప్రమాణాలతో తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యాపారస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post