- పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..
- గత ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వని దుస్థితి.. ప్రతీ ఒక్క గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు..
- రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు మీకు గుండు సున్నా వేయడం ఖాయం..
- శాయంపేట మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
శాయంపేట మండలం, 8 జూన్ 2025:
పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మొదటి విడతలో ఇళ్లు రానివారు ఎవరూ అధైర్య పడొద్దని *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* అన్నారు. ఈరోజు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. *కొప్పుల, వసంతాపూర్, గంగిరేణిగూడెం, సూర్యనాయక్ తండా, సాధనపల్లి, రాజుపల్లి, కాట్రపల్లి, నూర్జహాన్ పల్లి, ప్రగతిసింగారం, అప్పయ్యపల్లి, నేరేడుపల్లి, పత్తిపాక, హుస్సేన్పల్లి, కొత్తగట్టుసింగారం, సూరంపేట, నరసింహులపల్లి, మాందారిపేట, గోవిందాపూర్, పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, శాయంపేట, ఆరెపల్లి* గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను హన్మకొండ జిల్లా హౌసింగ్ పీడీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదికలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు. గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం రూ.22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం అజెండాగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నిరోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఇవ్వని ప్రతిపక్ష నాయకులు ఈరోజు ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే చూసి ఓర్వలేక శిలాఫలకాల ద్వంసానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. మేము చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుతగిలితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అన్నారు. బీఆర్ఎస్ గుండాయిజం మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను అందుకున్న పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ... గత పదేళ్లుగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు ఇళ్లు మంజూరు కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
Post a Comment