ప్రేమ పెళ్లి విషయంలో పోలీస్ స్టేషన్లో ఘర్షణ

వరంగల్ నల్లబెల్లి: ప్రేమ పెళ్లి విషయంలో రెండు కుటుంబాల మధ్య పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘర్షణ జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సం బంధించి ఏఎస్సై లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పల్లెబోయిన మణిరాజ్.. గత నెల 24న శాయంపేట మండలం ఆరెపల్లికి చెం దిన వడాల నితీషను ప్రేమ వివాహం చేసుకుని శాయంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఇరు కుటుంబా లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మణిరాజ్ తన భార్యతో కలిసి ఇటీవల నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలోని తన చిన్నమ్మ సముద్రాల స్వాతి ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న నితీష తల్లిదండ్రుల తోపాటు కుటుంబ సభ్యులు మంగళవారం శనిగరం చేరుకొని మణిరాజ్- నితిషలను అప్పగించాలని దూషిస్తూ స్వాతిపై దాడి చేశారు. దీంతో మణిరాజ్ 100 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. పోలీసుల రాకను గమ నించి వారు పారిపోయారు. కాగా ఇరువురిని బుధవారం పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిపించారు. పోలీస్ స్టేషను చేరుకున్న వడాల రాజిరెడ్డి తన బంధువుల సహకారంతో కుమార్తె నితీషను పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. సముద్రాల బాల రాజు, స్వాతితోపాటు పలువురు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీస్లు వారిని చెదరగొట్టి నితీషను స్టేషన్లోకి తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేశారు. భర్తతోనే ఉంటానని తేల్చిచెప్పడంతో నితిష కుటుంబ సభ్యు లు, బంధువులను అక్కడి నుంచి పోలీసులు పంపించారు. బుధ వారం జరిగిన దాడికి సంబంధించి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపార

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post