ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహాలకు లక్ష సహాయం

 అభినందించిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేటమండలంలోని సాధనపల్లి గ్రామంలో ముదిరాజులు తమ ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మిట్టపల్లి సతీష్ యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచి, దేవాలయంలో ప్రతిష్టించే పెద్దమ్మతల్లి, పోతరాజుల విగ్రహాల కోసం రూ. లక్ష రూపాయలు అందజేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిందం రవి, గ్రామస్తుల ఆధ్వర్యంలో సతీష్ విగ్రహాలను కొనుగోలు చేసి, గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈనెల 6న విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. తన వయసుకు మించి గ్రామంకోసం పాటు పడుతున్న సతీష్ ను బుచ్చిరెడ్డి, చిందం రవి, గ్రామస్తులు హృదయపూర్వకంగా అభినందించి, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు._

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post