పంట వ్యర్ధాలను కాల్చకూడదని తెలియజేస్తూ వాటివల్ల సహజ వనరుల క్షీణత మరియు మానవాళి మనుగడకు వాటిల్లే ముప్పు గురించి తెలియజేయడం జరిగింది. మట్టి పరీక్షలు చేయించి తద్వారా వచ్చిన ఫలితాలకు అనుగుణంగా ఎరువులు ఎలా వాడుకోవాలో తెలియజేయడం జరిగింది. విత్తనాల కొనుగోలులో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయవలసిందిగా సూచించడం జరిగింది. మోతాదుకు మించి రసాయనాలు వాడ వద్దని సూచించడం జరిగింది. కాంప్లెక్స్ ఎరువులను పై పాటుగా వాడకూడదని చెప్పడం జరిగింది విత్తనాలు ఎరువులు మరియు పురుగు మందులను కొనుగోలు చేసిన తర్వాత రసీదులను భద్రపరుచుకోవాలని సూచించడం జరిగింది. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని తెలియజేయడం జరిగింది.అనంతరం గట్ల కనపర్తి
లోని శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా విత్తన నిల్వలు మరియు పలు రికార్డులను పరిశీలించగా కొన్ని కంపెనీల విత్తనాలకు సరైన పత్రాలు లేవని గుర్తించి వాటి యొక్క అమ్మకాలను నిలిపివేయడం జరిగింది ఇందులో టాటా ప్రాడక్టు వారి బిగేక్స్ 16 ప్యాకెట్లు, రాసి సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి రాశి స్విఫ్ట్ 2 ప్యాకెట్లు, వేద సీడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డాక్టర్ చంద్ర గోల్డ్ అనే రకం 13 ప్యాకెట్లు మరియు యూఎస్ అగ్రి సీడ్స్ వారి యూఎస్ 7067 పది ప్యాకెట్లు గుర్తించడం జరిగింది మరియు వీటి యొక్క అమ్మకాలను నిలిపివేయడం జరిగింది అన్ని ప్యాకెట్లు మొత్తం 41 కాగా వీటి యొక్క విలువ 36,941 రూపాయలు.
Post a Comment