నడికుడ మండలంలోని ఎరువులు, పురుగుమందులు మరియు విత్తనాల షాపులను తనిఖీలు నిర్వహించడం జరిగింది. డీలర్లు ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమంఈదులను ఎమ్మార్పీ ధరలకు మాత్రమే విక్రయించాలి. రైతులకు తప్పనిసరిగా బిల్లులను ఇవ్వవలెను లేనియెడల శాఖ పరమైన చర్యలుతీసుకొనబడుతుంది. అదేవిధంగా రైతులు కూడా పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించడం జరిగింది.
ముఖ్యంగా 475 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధర రూపాయలు 901/- గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కావున విత్తనాలు కొనుగోలు సమయంలో రైతులు బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి.
అదికృత లైసెన్స్ కలిగిన డీలర్ డీలర్ వద్ద
మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి పంటకాలం పూర్తయ్యేంతవరకు బిల్లును భద్రంగా ఉంచుకోవాలి. బిల్లులో కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నెంబర్, ధర, డీలర్ సంతకము ఉండేటట్లు చూసుకోవాలి.
విత్తనాల ప్యాకెట్ పై తయారీ తేదీ, గడువు తేదీ మరియు జి ఈ ఏ సి నంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. హెచ్ టి-కాటన్ (బి సి-111) పత్తిని ప్రభుత్వ అనుమతి లేదు కాబట్టి ఇది నిషేధితమైనది.
విత్తనాలను లూస్ గా కొనకూడదు సీల్ ప్యాకెట్లలో మాత్రమే కొనుగోలు చేయవలెను. ముఖ్యంగా రైతులు 70 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిన తర్వాత మాత్రమే విత్తనాలను విత్తుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు రామకృష్ణ, ప్రదీప్
Post a Comment