ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.* ఓల్డ్ కర్నూల్ రోడ్డుపై ఒకే బైక్ పై ఎనిమిది మంది ప్రయాణిస్తూ విన్యాసాలు చేశారు. వాళ్ల విన్యాసాలను వీడియో తీసిన వారిని.. ఎందుకు వీడియో తీస్తున్నారు..'' అంటూ హెచ్చరిస్తూ నవ్వులు, కేరింతలతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వీడియో పోలీసులకు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ కర్నూల్ రోడుపై ఒక ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణించారని చెప్పారు. ఫ్రెండ్స్ తో వీడియో తీయించి ఎక్స్(ట్వీటర్)లో పోస్టు చేశారని తెలిపారు. ఆకతాయిల ర్యాష్ డ్రైవింగ్ పై సైబరాబాద్ సోషల్ మీడియా సెల్ నుంచి ఫిర్యాదు అందిందని.. వెంటనే టీమ్‌ను ఏర్పాటు చేసి ఎనిమిది మంది యువకులను ట్రేస్ చేశామని సీఐ తెలిపారు. వారిని సోమవారం (జూన్ 23) అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. అదే విధంగా నిర్లక్ష్యంగా వాహనం నడపంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Post a Comment