తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కేబినెట్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్లపై చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి గత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అనే అంశంతో పాటు పూర్తి వివరాలను ఈ నెల 30వ తేదీలోగా కమిషన్‌కి అందివ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.పీసీ ఘోష్‌ కమిషన్‌కు మినిట్స్‌తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే *స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.
రేపు(మంగళవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని నిర్ణయం* తీసుకున్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా క్లియర్‌ చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కాగా, మంత్రివర్గ సమావేశానికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి హాజరయ్యారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post