ఆకలి తీర్చే అన్నదాతకు...ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన...
రైతు భరోసాపథకం కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు ఖాతాల్లో నిధులు జమ..
నడికూడ మండల కేంద్రం లో రైతు భరోసా" సంబురాలు...
కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేతలా చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించిన ప్రజా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో 1 కోటి49లక్షల ఎకరాలకు తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించింది. అందులోనే భాగంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా నడికూడ మండల లోనీ బస్టాండ్ వద్ద రైతు భరోసా సంబరాలు నిర్వహించారు, నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే , సోనియాగాంధీ గాంధీ , రాహుల్ గాంధీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి వర్గానికి ఎమ్మెల్యే అందరికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు...ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ గడచిన 18 నెలలో రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం 1.04 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం పది సవంత్సరాల కాలంలో18 వేల కోట్లు రైతుబందు ఖర్చుపెడితే కేవలం18 నెలలోనే 21వేలకోట్లు రైతు భరోసా కింద ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టిందని అన్నారు.ఇది రైతు ప్రభుత్వం మని వెల్లడించారు
ఈ కార్యక్రమం లో మండల ప్రధానకార్యదర్శి డా. మాలహల్ రావు,మాజీ జడ్పీటీసీ పాడి కల్పనా ప్రతాప్ రెడ్డి,పరకాల బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని, మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం తిరుపతి రెడ్డి, పెద్ద బోయిన రవీందర్ యాదవ్,మాజీ ఎంపీటీసీ పర్నెంమల్లారెడ్డి,రైతులు,వివిధ గ్రామాలఅధ్యక్షులు,కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
Post a Comment