వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లుగా సమా చారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై పరంగల్ కమిష నరేట్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొం దించిన ప్రచార పోస్టర్లను మంగళవారం పోలీస్ కమిషనర్ అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఈ నకిలీ విత్తనాల నియంత్రణకై వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన చేస్తూ ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు రైతన్న ను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను, పురుగు మం దులు విక్రయిస్తుతే పిడి యాక్ట్ క్రింద కేసు నమోదు చేయడం జరుగుతుందని. నకిలీ విత్తనాలను విక్రయా లను నియంత్రియించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొం దించడం జరిగిందని. ఇప్పటికే వరంగల్ పోలీస్ కమి షనరేట్ పరిధిలో మొత్తం ఒక కోటి 23 లక్షల విలువ నకిలీ పురుగు మందులు, విత్తనాలతో పాటు పెద్ద
ఎత్తున గడ్డి మందును స్వాధీనం చేసుకోవడం తో పాటు 14మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగిందని. ఇకపై ఎవరైనా న నాలు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు వ చారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఫోన్ నంబర్ 7799848333 ఫోన్ నంబరకు సమాచారం అందిం చాలని. సమాచారం అందించిన వారి వివరాల ను గో ప్యంగా వుంచబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్ర మంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీ లు జితేందర్ రెడ్డి, డేవిడ్ రాజు, ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్ పాల్గొన్నారు
Post a Comment