మెరుగైన వైద్య సేవలు అందించాలి. పాల్గొన్న ఎమ్మెల్యేలు నాయిని,రేవూరి,ఎంపీ,కలెక్టర్- ప్రభుత్వ వైద్య సేవల బలోపేతంకోసం సమీక్ష పై సమీక్ష సమావేశం

హనుమకొండ జిల్లా కేంద్రంలోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో సోమవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరగింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమీక్షలో దవాఖాన అభివృద్ధి, వసతుల పెంపుదల, సిబ్బంది విని యోగం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసన సభ్యు నాయిని రాజేందర్ రెడ్డి పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఐఏఎస్ హాజరయ్యారు. సమీక్షకు ముందు ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఆసుపత్రి ఆవరణలో వివిధ విభాగాలను పరిశీ లించారు. శిథిలావస్థలో ఉన్న ప్రహరీ గోడలను పరిశీలించి నూతన ప్రహరీ నిర్మాణం త్వరగా చేపట్టాలని సూచించారు. నిరుపయోగంగా మారిన పురాతన భవనాలను తొలగిం చాలని సూచించారు. ఒపీ విభాగాన్ని సందర్శించి, రోగుల నమోదు (ఇన్/అవుట్) పత్రాలు పరిశీలించారు. రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు పొందారు. ప్రసూతి వార్డు, మెడికల్ స్టోర్, ఇతర కీలక విభాగాలు నిశితంగా పరిశీలించారు. అనంతరం
సమీక్షా సమావేశంలో ఆసుపత్రిలో ఉన్న వైద్య సేవల స్థితిగతులు రోగులకు అవసరమైన అదనపు వసతులు వైద్య సిబ్బంది పౌర అవసరాలకు తగినట్లుగా ఉండేలా మార్పులు ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన పెంచే ప్రచార కార్యక్రమాలు ఆశా కార్యకర్తల వాడకంతో గ్రామీణ ప్రజలకు సేవలు అందించాలన్న దిశగా సూచనలు చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ: హనుమకొండ మెటర్నిటీ హాస్పిటల్కు ఎంతో గౌరవప్రదమైన చరిత్ర ఉంది. అనేక పేద ప్రజలకు ఇది వెలకట్టలేని వైద్య సేవలను అందిస్తోంది. ఈ హాస్పిటల్ను హెరిటేజ్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోం ది. ఆసుపత్రికి కావాల్సిన నిధులను త్వరలో ప్రతినిధు లందరం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో రెడ్ క్రాస్ ఈసీ సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ అప్పయ్య, ఆసుపత్రి వైద్యులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post