శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో గురువారం నాడు 19-06-2025 రోజున ఉదయం 10 గంటలకు వికసిత్ భారత్ యొక్క అమృతకాల సేవా సుపరిపాలన – పేదల సంక్షేమానికి 11సంవత్సరాల మోడీ గారి ప్రభుత్వం గడచిన సందర్భంగా **సంకల్ప సభ* నిర్వహించడం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు భారతదేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో, "వికసిత్ భారత్ @2047" లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమృతకాల సేవా సుపరిపాలన సంకల్ప సభ విజయవంతం కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలలో భాగంగా, గత 11 సంవత్సరాలలో పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సంక్షేమ పథకాల సమర్థ అమలుపై కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రజల మద్దతుతో మరింత బలపరచడానికి ఈ "సంకల్ప సభ" నిర్వహించబడుతుంది కావున మండలంలోని రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, మండల పతాధికారులు, సీనియర్ నాయకులు పార్టీ శ్రేయోభిలాషులు మరియు మండలంలోని పుర ప్రముఖులు అందరూ హాజరై ఈ యొక్క సంకల్ప సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు
సంకల్ప సభను విజయవంతం చేయాలి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment