హాస్టల్ కు వెళ్ళనని .. పురుగుల మందు తాగిన విద్యార్థి

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి
చెందిన కూన సంపత్ అనిత వీరికి ఇద్దరు సంతానం పెద్ద కుమారుడు సంజయ్, కూతురు వైష్ణవి ఉన్నారు. కూతురు కూన వైష్ణవి వయస్సు (14) సం ఈనెల 23 తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఎస్సై జి. నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వైష్ణవి ఏడవ తరగతి పాస్ అయి ఎనిమిదో తరగతికి హాస్టల్ కి పంపిద్దామని తల్లిదండ్రులు కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్థాపం చెంది 23వ తేదీన పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. నరేందర్ రెడ్డి తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post