బి ఆ ఎస్ నాయకులు మాట్లాడే అర్హత లేదు.రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడి నైతిక హక్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు టిడిపి గురించి మాట్లాడే హక్కు లేదని రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ , రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గోస్కొండ వెంకటేష్ అన్నారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాదు ఐటీ కి పునాదులు వేసిన ప్రపంచ దేశాల హైదరాబాద్ వైపు చూసేటట్లు చేసిన ఘనత నారా చంద్రబాబునాయుడు కెఘనత దక్కుతుందని వారు తెలిపారు .లిక్కర్ స్కాం లో కవిత జైలుకు వెళ్లి వచ్చిందని కోరారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని వారు పేర్కొన్నారు కేసీఆర్ టిడిపిలోనే రాజకీయం నేర్చుకున్నాడు అన్న విషయాన్ని కవిత మర్చిపోవద్దన్నారు రాష్ట్రవ్యాప్తంగా బీ ఆర్ఎస్ హాయంలో జరిగిన అవినీతిని ఎండగడతామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడును విమర్శించే హక్కు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని తెలిపారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గోస్కొండ వెంకటేష్ ,ప్రధాన కార్యదర్శి గూడప రాఘవ్ ,కోలాన్ వేణుగోపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి రాములు, ఆరోగ్యం ,సైదులు ,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post