ఎస్ బిఐలో 2,964 పోస్టులు.. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు

ఎస్‌బీఐలో 2,964 పోస్టులు.. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు
SBI 2,964 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 29 ఆఖరు తేదీ కాగా.. అప్లై చేసుకోని వారి కోసం అప్లికేషన్‌ విండోను జూన్‌ 30 వరకు ఓపెన్‌ చేశారు.
మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 233, అమరావతి సర్కిల్‌ పరిధిలో 186 పోస్టులు ఉన్నాయి. 2025 ఏప్రిల్‌ 30 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయస్సు ఉండాలి.
రిజర్వేషన్‌ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు.ఏ సర్కిల్‌లోని కాళీలకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు.. ఆ సర్కిల్‌లోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్‌, స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ టెస్టులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నేస్, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ గురించి ప్రశ్నిస్తారు. డిస్క్రిప్టివ్‌ టెస్టులో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ను పరీక్షిస్తారు.
జనరల్‌, ఓబీసీ, ఈడబ్య్లూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు రూ.48,480 అందుతుంది. పూర్తి వివరాలు https://sbi.co.in/లో చూడండి.



0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post