హన్మకొండ భద్రకాని బండ్:
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా వారి ఆధ్వర్యంలో వరంగల్ మహానగర పాలక సంస్థ వారి సహకారంతో ఈరోజు హనుమకొండ భద్రకాళి బండ్ లో వీధి ఆహార విక్రయాదారుల వంట కళల ప్రదర్శన మరియు అమ్మకాన్ని (స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రదర్శన) ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు, అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వీధి ఆహార పదార్థాలు, వంటకాలను పరిశీలించి రుచి చూశారు, మెప్మా వారు పట్టణ పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు మహిళా సంఘాలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలను చేపడుతూ.. స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాల ద్వారా, మెప్మా వీధి వ్యాపారులకు మరియు చిన్న వ్యాపారాలకు ఆర్థికంగా ఎదగడానికి సహాయపడుతుండటం చాలా అభినందనీయమని అన్నారు.
Post a Comment