గ్రామ సభ ద్వారానే ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేయాలి.

గ్రామసభ ద్వారానే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ జరగాలని బహుజన సంక్షేమ సంఘం నాయకులు ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభద్వారా నిర్వహించకుండా, ఇష్టం వచ్చిన రీతిలో ఎంపిక ప్రక్రియ చాటుమాటున ఎందుకు ఎంపిక చేశారని ఎంపీడీవో ని అడగగా ఈ ఎంపిక ప్రక్రియతో మాకు సంబంధం లేదు అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. మీరు ఏదైనా అడగాలి అని అనుకుంటే ప్రభుత్వాన్ని అడగండి అని మా దగ్గర కాదు అని చెప్పడం పట్ల ఆయన విధుల పట్ల ఎంత నిజాయితీగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుందని, ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ప్రజలు చాలా ఆశగా ఉన్నా కానీ దానికి భిన్నంగా భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండలం లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ఎలా జరిగింది అని అధికారులని అడిగితే కమిటీ పైన కమిటీ వాళ్ళని అడిగితే అధికారుల పైన ఒకరిపై ఒకరు చెబుతూ పేద ప్రజలకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలనకు వ్యతిరేకంగా గ్రామసభల ద్వారా ఎంపిక జరగకుండా ఉండడాన్ని నిరసిస్తూ ఎంపీడీవో
కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా మొన్న జరిగినటువంటి ఎంపికను గ్రామసభ నిర్వహించి గ్రామ ప్రజల ఆమోదం చేత లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇట్టి నిరసనను పోలీసుల జోక్యంతో శాంతింపజేసి ఎంపీడీవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి ఎంపీడీవో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, మారపెల్లి విజయ్, మారపెల్లి సుధాకర్, మొగ్గం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post