భూపాలపల్లి జిల్లాలో 8.70 కోట్ల విలువైన సబ్ స్టేషన్ లను ప్రారంభించిన అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్
కాలేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్ము దోపిడీ చేసి సిగ్గు లేకుండా బ్రహ్మాండమని చెబుతున్నారు.
అత్యంత ప్రమాదకరం, డిజైన్ కు కట్టిన దానికి పొంతనలేదని NDSA చెప్పింది
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులకు చిన్న పగులు కూడా రాలేదు రాష్ట్రంలో ఇల్లు లేని, ఆదాయం లేని కుటుంబాలు ఉండొద్దు.. ఆకలితో ఏ ఒక్కరు బాధపడొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో సంక్షేమాన్ని వెనుకబడనివ్వం, అభివృద్ధిని ఆగనివ్వం
గతంతో పోలిస్తే 2,000 మెగావాట్ల అదనపు డిమాండ్ వచ్చిన రాష్ట్రంలో ఒక్క నిమిషం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది
Post a Comment