విద్యుత్తు ఉప కేంద్రం మరియు మంజూర్ నగర్, ధర్మారావు పేట, నవాబ్ పేటలలో 33/11కె వి ఉప విద్యుత్తు కేంద్రాలు నిర్మాణానికి శంకుస్థాపన

రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల
శ్రీధర్ బాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కోసం కష్ట పడుతున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును అభినందించారు. సబ్ స్టేషను శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చెన్నపూర్ లో కోటి 40.లక్షలతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్తు ఉప కేంద్రం మరియు మంజూర్ నగర్, ధర్మారావు పేట, నవాబ్ పేటలలో 33/11కె వి ఉప విద్యుత్తు కేంద్రాలు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో
వినియోగదారుల ఇబ్బందులను తొలగించేందుకు 8 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మాణం చేపట్టామని తెలిపారు. రాబోవు 20 సంవత్సరాల వరకు ఒక ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. 2047 అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ తయారు చేయాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. 200 యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలపై చిలుకు ఉంటే భూపల్లిలో 50 వేల మందికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. గత ఉగాది నుండి జీరో బిల్లు ఇస్తున్నామని అన్నారు. విద్యుత్తు అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్తు అంతరాయం లేకుండా ముందుకు పోతున్నామని, 46 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చారు మని తెలిపారు. సౌర శక్తిని పెద్ద ఎత్తున వినియోగానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళా సభ్యులకు సోలార్ విద్యుత్తు ఉత్పాదన యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని మాటల్లో చూపించే ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన 7 వేల కోట్లు పైచిలుకు అప్పుకు మిత్తి చెల్లిస్తున్నామని తెలిపారు. బిఆర్ ఎస్ నాయకులు ఉచిత బస్సు నిలిపివేయాలని అంటున్నారని తెలిపారు. మన జిల్లాలో ఉన్న నీటి వనరులు దుర్వినియోగం చేశారని అన్నారు. చుక్క నీళ్లు ఇవ్వలేని వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలకు సబంధించి ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీలు వాడుకున్నారో తెలియ చేస్తామన్నారు. ట్రిబ్యూ నల్ లో వాటా విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని 
వాదించినట్లు తెలిపారు. సంపన్నులు తినే సన్న బియ్యం నేడు పేదోళ్ళు తింటున్నారని తెలిపారు. ఆటంకం కలిగచేయాలని చూస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణ రైజింగ్ పేరుతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతి మండలంలో విద్యుత్తు శాఖ ఏఈ కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు. కేంద్ర నిధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు. ఐటి విభాగం ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు.  
వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం
కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని పనులను కూడా నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. వైద్య విద్య రంగాలలో ముందంజలో ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క కార్యక్రమం కాంగ్రెస్ పేదల కోసం, పేదల కలలను నిజం చేయడానికి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఎలాంటి ఇల్లు నిర్మాణం చెప్పట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారని అన్నారు. మహిళా శక్తి కార్యక్రమాలు చేపట్టి మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పంతో త కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతులకు, విద్యా, వైద్యం అన్ని రంగాలను సమంగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్నదని తెలిపారు. కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం కోతలు ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని తెలిపారు. భూపాలపల్లికి రైల్వే స్టేషన్ ఉండాలని ప్రయత్నం చేస్తానని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ విద్యాలయం మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరూ ఏకమై రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని సూచించారు. మన దేశాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 
భూపాలపల్లి శాసన సభ్యులు
గండ్ర సత్యనారాయణ రావు
మాట్లాడుతూ187 గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో సంవత్సరాలుగా సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సూచించారు. పరశురాంపల్లి, దుబ్బపల్లి గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ చేయాలని తెలిపారు. 
33/11కెవి సబ్ స్టేషన్లు నిర్మాణం వల్ల లో వోల్టేజీ సమస్య తీరిపోతుందని తెలిపారు. విద్యుత్తు సామాన్లు నిల్వ చేసేందుకు స్టోరేజి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కొరకు 12 మండలాలలో ఏ ఈ కార్యాలయాలు గోరికొత్త పల్లి మండలంలో విద్యుత్తు కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. రోజుకు 18 గంటలు పని చేస్తున్నామని, నిజాయితీ నిష్పక్షపాతంగా పని చేస్తున్నామని తెలిపారు. రైతులకు రుణ మాఫీ చేసినట్లు తెలిపారు. 200 లోపు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. 5 నుండి 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పెంచినట్లు తెలిపారు. ఆసుపత్రిల్లో వైద్య సేవలు పెరిగాయని, సిటీ, ఎమ్మారై ఏర్పాటు చేయాలని కోరారు. నెఫ్రాలజీ, ప్లాస్టిక్, సూపర్ స్పెసిలిస్టు వైద్యులను నియమించాలని తెలిపారు. దొడ్డు బియ్యం దళారుల బారి నుండి రక్షించడానికి సన్న బియ్యం 4 లక్షల కోట్లు ఖర్చు చేసి పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. జాబ్ మేళా నిర్వహించి 2700 మందికి ఉపాది అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. స్కిల్ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. గత ప్రభుత్వం కేజీ పీజీ లేదు, రుణమాఫీ చేయలేదని తెలిపారు. రుణమాఫీ చేసింది తమప్రభుత్వం అని తెలిపారు. మోరాంచపల్లి వాగులో మరణించిన వారికి లక్ష రూపాయలు ఆర్డిక సాయం అందించామని తెలిపారు. సింగరేణి గనులు ఏర్పాటు లో భూములు కోల్పోయిన వారికి ఆర్టిజియన్స్ గా నియమించాలని తెలిపారు. పరిశ్రమ లు ఏర్పాటు లో 60 మంది కాట్రాక్టు కార్మికులు ఉన్నారని, వారిని సింగరేణి, కెటిపిపిలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. దుబ్బపల్లి, పరశురాం పల్లి గ్రామాలను ఆర్ అండ్ ఆర్ క్రింద మార్చాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి,ఎన్పి డీసీఎల్ సిఎండి పరెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, మార్కెట్కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post