బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ వారికే ఇందిరమ్మ ఇల్లు.... ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పెద్దకోడపాక ఇందిరమ్మ కమిటీ... ఎమ్మెల్యే చెప్పిన పట్టించుకోని వైనం.... ఇండ్లు భవనాలు ఉన్నవారికి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు... నిరుపేదలకు నిరాశ... అద్దె ఇంట్లో ఉంటున్న వారికి నిరాశే
ఇందిరమ్మ ఇళ్లలో కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రమే ఇస్తామని మిగతా పార్టీ వారికి ఇచ్చే ప్రసక్తే లేదని ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్ద కోడపాక గ్రామానికి చెందిన రాజోలు నరహరి అనే వ్యక్తికి సొంత ఇల్లు లేదు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లలో అర్హునిగా తన పేరు ప్రకటించారు అయితే మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గతంలో కలిసిన క్రమంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశానని అది సాకుగా చూపి మంజూరైన ఇందిరమ్మ ఇల్లును ఇందిరమ్మ కమిటీ సభ్యులు తొలగించారు అడిగితే కేవలం కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేశారని బాధితులు వేడుకుంటున్నారు గత పది సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో అద్దెగడుతూ ఉన్నానని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే చొరవతో ఇల్లు వస్తుందని ఆశపడిన తమకు స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీరని అన్యాయం చేశారని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి విచారణ జరిపి నాలాంటి వారికి అండగా నిలవాలని ప్రభుత్వం పై నమ్మకం ఉంచాలని కోరుకుంటున్నారు
Post a Comment