పిల్లలతో కలిసి వివాహిత అదృశ్యo..

పిల్లలతో కలిసి వివాహిత అదృశ్యo.. 

BLN తెలుగు దినపత్రిక దామెర: పిల్లలతో కలిసి వివాహిత అదృశ్యమైన ఘటన దామెర మండలం లో చోటుచేసుకుంది. దామెర ఎస్సై కొంక అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్ కు చెందిన దాస సాయిబాబా 13 సంవత్సరాల క్రితం చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన బౌతు రజిత అలియాస్ మమతను ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. గత నెల 7 వ తేదీన రజిత పిల్లలను తీసుకొని దామెర మండలం ముస్తాలపల్లి గ్రామానికి బొడ్రాయి నిమిత్తం వెళ్ళింది. బొడ్రాయి పండుగ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా ఇద్దరు పిల్లలను తీసుకొని ముస్తాల పెళ్లి నుంచి వెళ్లిoది. తిరిగి ఇంటికి పోకపోవడంతో భర్త వారి కోసం వారి బంధువుల చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించలేదు. దీనతో దామెర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దామెర ఎస్సై అశోక్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post