ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
దేవాలయ స్థల దాతకు ఘన సన్మానం.
మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.
నల్లబెల్లి, బి ఎల్ ఎన్ తెలుగు దినపత్రిక:
అత్యంత వైభవంగా ముదిరాజ్ ల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మండలంలోని నారక్క పేట గ్రామంలో ఘనంగా ప్రతి స్థాపించి వండుగను సంబరంగా ముదిరాజుల తోపాటు గ్రామ ప్రజలు వేడుకలలో పాల్గొనగా. ఇట్టి కార్యక్రమానికి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని అందరి ఇలవేల్పుగా ఉండే పెద్దమ్మతల్లి గ్రామ ప్రజలను, పాడిపంటలను కాపాడుతూ తన చల్లని చూపులతో అందరిని క్షేమంగా చూడాలని ఆయన అన్నారు. అలాగే దేవాలయానికి స్థల దాత అయిన సూరబోయిన రాంబాబుని
దేవాలయ ప్రాంగణంలో శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. పెద్దమ్మ తల్లి ఆలయానికి తనవంతు కృషిగా ఆర్ధిక సాయం అందజేయడం జరిగిందని, గ్రామంలో మరిన్ని కార్యక్రమాలకు నా వంతు కృషిగా ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు సదా మీ సేవలో ఉంటానని అన్నారు. మరింత ఉత్సాహంతో ముదిరాజ్ కులస్తులు పండుగను సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పారపు రాంబాబు, ఓదెల రవి, ముహూర్తాల రామారావు, కారుకూరి శ్రీనివాస్, పెరుగు కృష్ణమూర్తి పోగుల పైడి, కన్నూరి రమేష్, వక్కల తిరుపతి, ముక్కిస రాంబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment