వేముల వాడ ఆలయం వివాదంపై బంద్ కు పిలుపు
అందరితో చర్చించండంటూ మంత్రి దిశానిర్దేశం వేములవాడ, బి ఎల్ ఎన్ తెలుగు దినపత్రిక:.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శంకుస్థాపన చేసింది. పనులు కూడా ప్రారంభించింది. దాదాపు.. రెండేళ్ల వరకు కూడా భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం ఉండదు. అయితే.. పూజాలు, అభిషేకాలు మాత్రం జరుగుతుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాజన్న ఆలయం డెవ్ లప్ మెంట్ పనుల్ని స్వాగతిస్తునే.. మరోవైపు స్థానిక ప్రజలు, భక్తులు.. రెండెళ్ల పాటు స్వామి వారి దర్శనం కల్పించకుండా ఉండే నిర్ణయంను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. ఇది తమ మనోభావాలకు చెందిన అంశమన్నారు. ఈరోజు వేముల వాడ వ్యాప్తంగా వ్యాపారులు, భక్తులు,స్థానికులు బంద్ ను పాటిస్తు న్నారు. ఈ నేపథ్యంలో వేముల వాడలో ఎక్కడికక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందో బస్తు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. వేముల వాడ వివాదంపై తాజాగా... మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యా రు. రాజన్న దేవాలయ కమిష నర్, ఈవోల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజన్న ఆలయం విస్తీర్ణం పెంపుపై అపోహాలపై చర్చించారు. కేవలం భక్తుల సౌకర్యం కోసమే.. ఆలయం విస్తీర్ణం పెంపును చేపట్టామని దేవాలయ అధికా రులు స్పష్టం చేశారు. ఆలయం విస్తీర్ణం పై ప్రజల్లో ఉన్న అపోహ ల్ని తొలగించి, అన్ని వర్గాల ప్రజలతో చర్చించాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Post a Comment