మొగిలిచర్ల అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన చల్లా ధర్మారెడ్డి.. బాధిత రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్..

భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఇప్పటి వరకు స్పందించని వ్యవసాయ అధికారులు..
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్ల శివారులో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం ఉదయం సందర్శించారు.ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మొక్కజొన్న చేలు,ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడి ఓదార్చారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..ప్రమాదవశాత్తూ జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురి రైతులకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతయ్యాయి.సుమారు 40 ఎకరాలకు మంటలు విస్తరించి రూ.20లక్షల విలువచేసే పంట బూడిద అయిందన్నారు.
ఆరుగాలం కష్టం చేస్తే చేతికి వచ్చిన పంట కళ్ళముందే బుగ్గిపాలవుతే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వం ఆలోచించాలి.ఈ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తే నేడు ఈ రైతులకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు.ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరిగితే ఇంతవరకు వ్యవసాయం అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించలేదని రైతులు వాపోతున్నారని అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంఘటనలకు తావులేదని అన్నారు.రైతు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కల్లువతెరిచి అగ్నిప్రమాదంలో కాలిపోయిన మొక్కజొన్న పంటలు వివరాలు సేకరించి ఆ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post