కళ్యాణ మహోత్సవానికి హాజరై పట్టువస్త్రాలు సమర్పించిన చల్లా దంపతులు..
శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కళ్యాణ మహోత్సవానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి - జ్యోతి దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.ఆ శ్రీరాముని చల్లని దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని,సుఖ సంతోషాలతో వారి జీవనం కొనసాగాలని ఆ దివ్యమూర్తులను ప్రార్ధించడం జరిగిందని తెలిపారు.ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఇంత ఘనంగా గ్రామంలో నిర్వహించడానికి కృషిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Post a Comment