వరంగల్ జిల్లానల్లబెల్లి మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. నల్లబెల్లి గ్రామంలోని అంగన్వాడీలో ఇటీవల బాలింతలు, గర్భిణిలకు గుడ్లు పంపిణీ చేశారు. వాటిని ఉడకబెడితే కుళ్లిన వాసన వచ్చాయి. అనుమానం వచ్చి ఉడకబెట్టని గుడ్లను పగులగొట్టగా పాడైపోయి కుళ్లిన వాసన వచ్చాయి. పౌష్టికాహారంలో అందిచాల్సిన అంగన్వాడీల్లో ఇలా నాసిరకం, పాడైపోయిన గుడ్లు, ఇతర సామాన్లు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.బుధవారం వాటిని ఉడికించి పై పోట్టును తీయగా కుళ్ళిపోయి పురుగులు బయటకు రావడంతో ఆ కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారుచిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక లోపాలు అధిగమించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహార పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుకు ప్రతినెలా 16 కోడిగుడ్లను అందించాలి. గుడ్లయితే ఇస్తున్నారు కానీ... అందులో నాణ్యత ఉండటం లేదు. ఫలితంగా ఉన్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌష్టికాహార లక్ష్యానికి గండిపడుతోంది. పేదల కోసం ఎంతో ఖర్చుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పర్యవేక్షణా లోపంతో గాడితప్పుతోంది.మండల కేంద్రంలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాలలో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు గుడ్లపై అనుమానం వచ్చి పగలగొట్టి చూడటంతో కుళ్లిపోయిన గుడ్లు దుర్వాసనతో దర్శనం ఇచ్చాయి.అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ... అధికారుల నుంచి ఎలాంటి పర్యవేక్షణా లేదని ఇది కాంట్రాక్టర్లకు వరంగా మారిందని,సాధారణంగా ఒక గుడ్డు 50గ్రాములుండాలని కానీ కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న గుడ్లు చాలావరకు నాసిరకంగా ఉంటున్నాయని తక్కువ ధరకు దొరికే... తక్కువ పరిమాణంలో ఉన్న, మురిగిపోయిన గుడ్లు సరఫరా చేస్తున్నారని గుడ్లు చిన్నగా ఉంటున్నాయని, ఉడికించిన గుడ్ల నుంచి దుర్గంధం వస్తోందని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా సంక్షేమాధికారులు చొరవ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలను అందిస్తున్న ఆహార పదార్థాలను ప్రత్యేకంగా పర్యవేక్షించి అందించాలని స్థానిక లబ్ధిదారులు కోరుతున్నారు.
తమకేదైనా అయితే..?
అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ లోగో తో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయగా.. కాంట్రాక్టర్లు మాత్రం కుళ్లిన , చిన్న సైజు గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఎల్లకొండలోని అంగన్ వాడీ సెంటర్ కు కుళ్లిన, చిన్న కోడిగుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేశారు. కొందరు గర్భిణులు, బాలింతలు ఇంటికి తీసుకెళ్లి ఉడకబెట్టగా దుర్వాసన రావడంతో వాటిని పారవేశారు. కొందరు తిరిగి అంగన్ వాడీ సెంటర్ కు తీసుకొచ్చారు. ఈ కుళ్లిన గుడ్లు మాకు ఎందుకు అంటూ పలువురు గర్భిణులు, బాలింతలు ప్రశ్నించారు. తమకేదైనా అయితే బాధ్యులు ఎవరని నిలదీశారు. పై నుంచి ఇస్తున్నారని, తామేం చేస్తామని అంగన్ వాడీ టీచర్లు చెబుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడమే లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు అంగన్వాడీ సెంటర్లను తనిఖీలు చేయాలని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు
Post a Comment