దమ్మన్నపేట గ్రామంలో ప్రమాదవశాత్తు ఇళ్లు దగ్ధం
బండి అశోక్ కుటుంబానికి అండగా ఉంటానన్న ఎమ్మెల్యే..
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి ఇస్తానని ఎమ్మెల్యే హామీ..
ఈరోజు ఉదయం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో ప్రమాదవశాత్తు బండి అశోక్ గౌడ్ కు చెందిన పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దమ్మన్నపేట గ్రామంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను స్థానికులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న అశోక్ గౌడ్ కుటుంబం సంపాదించుకున్న నగదు, పండించిన పంట, ఇతర వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఇది చూసిన ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. అశోక్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని అన్నారు. తక్షణ సాయం కింద అశోక్ గౌడ్ కుటుంబానికి అందాల్సిన సాయాన్ని అందించాలని రేగొండ ఎమ్మార్వోకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం అశోక్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బియ్యం, నిత్యవసర సరుకులు, దుస్తులు, దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
Post a Comment