అంబేద్కర్ ను,రాజ్యాంగాన్ని అవమానించడమే బీజేపీ లక్ష్యం..కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ ను అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుందని అందుకే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను చేస్తుందని శాయంపేటకాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం మండలంలోని కొత్తగట్టు సింగారం మాందారి పేట గ్రామాలలో జై బాపూ,జై భీమ్,జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ప్రజల హక్కులను కాలరాస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కు కట్టుబడి ఉందని బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలను సాగనివ్వమని అన్నారు. గాంధీ,అంబేద్కర్లు నింపిన స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని,అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరేవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పని చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లా చక్రపాణి పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి వైనాల కుమారస్వామి చిట్టి రెడ్డి రాజిరెడ్డి ప్రకాష్ రెడ్డి మారేపల్లి రవీందర్ చిందం రవి మారెపల్లి క్రాంతి కుమార్(కటయ్య) కొమ్ముల భాస్కర్ నిమ్మల రమేష్ నాగేశ్వరరావు నిమ్మల రమేష్ తిరుపతి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు
కొత్తగట్టు సింగారం/మాందారి పేటపల్లె పల్లెకు కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర..
byBLN TELUGU NEWS
-
0
Post a Comment