శాయంపేట ఎస్సీ కాలనీలో మారపెల్లి సమ్మయ్య ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..
మండలంలోని 842 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1,59,60,000 విలువ కలిగిన జంబో చెక్కును అందజేసిన ఎమ్మెల్యే..
శాయంపేట మండలం, 12 ఏప్రిల్:పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శనివారం భూపాలపల్లి నియోజవర్గం శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మారపెల్లి సమ్మయ్య ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నేలపై కూర్చుని భోజనం చేశారు. అంతకుముందు సమ్మయ్య కుటుంబ సభ్యుల యోగక్షేమాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్ళలో ఆనందాన్ని స్వయంగా చూశానని ఎమ్మెల్యే అన్నారు.స్వయంగా సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని, సంతృప్తి ఇచ్చిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. భోజన అనంతరం ఎమ్మెల్యే సమ్మయ్య కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. అంతకుముందు శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. సురేఖ మండల సమాఖ్య శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 842 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1,59,60,000 విలువ కలిగిన జంబో చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post